Wednesday, November 14, 2012

Change within us!!

"... కనుక ముందు మనం మారాలి, అప్పుడే దేశం మారుతుంది" అంటూ యువజన మహోత్సవం లో తన ప్రసంగాన్ని ముగించాడు సుబ్బారావు. సుబ్బారావు దేశంలోని అవినీతిని ఎండగట్టడంలో, దేశం మారాలి అని ప్రగాడంగా కోరుకునే వాళ్ళల్లో సుబ్బారావు ఒకడు. అందుకోసం ఎక్కడ సందు దొరికితే అక్కడ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు.




ఒకరోజు సుబ్బారావు అతని భార్య ప్రభావతి వంటింటి సామాను కొనడానికి ఒక సూపర్ మార్కెట్ కు వెళ్లారు. కావాల్సిన సరుకులు కొనుగోలు చేస్తున్నారు.

"ఏమేవ్.. వెళ్లి ఆ బిల్ కట్టే లైన్ లో ఉండు. లేదంటే లైన్ బాగా పెరిపోతుంది " అని భార్య ను పంపించేసాడు సుబ్బారావు.

కావలసినవి ఒక ట్రాలీలో నింపుకొని వెళ్లి బిల్ కట్టారు. తర్వాత గుర్తోచింది ప్రభావతికి నూడుల్స్ తీసుకోవాలని వాళ్ళ పిల్లలకి.

"ఏవండి పిల్లలు నూడుల్స్ తీసుకున్నారా?" అని అడిగింది

"ఇప్పుడా చెప్పేది? బిల్ వేయించుకున్నాం కదటే? ఇంకోసారి తీసుకుందాం లే" సుబ్బారావు విసుగ్గా చెప్పాడు.

"పిల్లలు నిన్న కూడా అడిగారండి కావాలని. తీసుకుందాం పదండి" అని గోముగా అడిగేసరికి సుబ్బారావు తప్పదు అన్నట్టు వెళ్లి దానికి మళ్ళి బిల్ వేయించాడు.

బయటకు వచేప్పుడు సెక్యూరిటీకి బిల్ చూపించి స్టాంప్ వేయించుకొని వచ్చేసాడు.

కారు ఎక్కేటప్పుడు చూసుకుంటే, పొరపాటున నూడుల్స్ కు వేయించిన బిల్ స్టాంప్ వేయించలేదు అని గమనించాడు.

"వెళ్లి ఇంకొక నూడుల్స్ ప్యాకెట్ తీసుకొని బిల్ వేయించకుండా వచ్చేసేయండి. అడిగితే ఈ పాత బిల్ ను చూపించండి" ఐడియా ఇచింది ప్రభావతి.

భార్య తెలివికి మురిసిపోయి మన సుబ్బారావు లోపలి వెళ్లి ఇంకో నూడుల్స్ ప్యాకెట్ తో బిల్ కట్టకుండా గర్వంగా బయటకు వచ్చాడు. ఎదో సాదించినట్టుగా!



ఇదంతా పైనుండి చూస్తున్న ఒక స్వాతంత్ర్య సమరయోధుడు గారు అనుకుంటున్నారు... "ఒక్క నూడుల్స్ ప్యాకెట్ కోసం కక్కుర్తి పడి షాప్ వాడిని మోసం చేసే వీడు... మనం మారాలి, దేశాన్ని మార్చాలి అని ఉపనస్యలిస్తున్నాడా! ఇదెక్కడి నిజాయితి?" అని బాధపడ్డాడు.



మర్నాడు మన సుబ్బారావు ఇంకొక ఉపన్యాసానికి తయారవుతూ కనిపించేసరికి స్వాతంత్ర్య సమరయోధుడు గారు మూర్చ పోయారు.. మనం మారడం అంటే ఇలాంటి చిన్నవిషయాలే దోహదపడతాయి. ఇలా చిన్న విషయాలకే కక్కుర్తి పడితే, కోట్లతో యవ్వారం నడిపేవాళ్ళు నిజాయితిగా ఉండాలని మనం ఎలా అనుకుంటాం?? మార్పు మనతోనే సాధ్యం!!!

Wednesday, November 7, 2012

అదొక తియ్యని కల.. రోజు కంటున్న కల... షరా మాములుగా మళ్లీ ఈరోజు కూడా వచ్చింది.

సమాజం అంటే ఏంటో తెలియని వయసులోనే నేను సమాజానికి ఎదో ఒకటి చేయాలి అని ఆరాట పడుతుండేవాడిని . వయసు తో పాటు సమాజం అంటే ఒక అవగాహన ఎం చేయాలి అనే స్పష్టత వచ్చాయి. అదే ఈ కల



అదొక పెద్ద భవనం. సుమారుగా ౩౦౦- మంది విద్యార్థులు నివాసముంటున్న భవనం. వారంతా అభాగ్యులు, అనాధలు. వారికి తిండి కూడు బట్ట విద్య అన్నీ అక్కడే. సమాజానికి మంచి పౌరులను అందిచడమే ధ్యేయంగా కొంతమంది మిత్రులు చేత స్థాపించబడిన ఒక సేవాసదనం.

అక్కడి విద్యార్థులు ఆటల్లోనూ పాటల్లోనూ సేవలోను అన్నింటిలోను ముందే. భారతీయ సంప్రదాయాలు, విలువలు, మానవత్వపు పరిమళాలు, ధర్మ-అధర్మాలు అన్నీ నేర్పుతారు అక్కడ.

ఆ సేవాసదనంను చూసి అందరు గర్వపడుతుంటారు. అక్కడ పాటశాలలో చేరాలని పిల్లలు ఉవ్విల్లురుతుంటారు. ఆ వాతావరణం లో గడపాలని ఉబలాటపడుతుంటారు. ఆ పాటశాల రవీంద్రుని శాంతినికేతనం. ఆ ఆట మైదానం అమ్మ ఒడి.

వాళ్ళందరి మధ్య, పండిన తలతో, పిల్లలతో ఆడుకుంటూ.. అదే ఆనందం అనే భావనలో.. .నేను!!

ఇదే నా కల! నన్ను నిద్రపోనివ్వని కల!!

మొదటి అడుగు పడింది.. స్వదేశ్నిర్మాణ్ అనే సదనం ప్రారంభమైంది.
 అడుగులు వేస్తోంది గమ్యం వైపు.